: ‘దర్శనం’ పాత్ర నా హృదయానికి ఎంతో దగ్గరైంది: హాస్య నటుడు వెన్నెల కిషోర్


యువ హీరో నాని కథానాయకుడిగా నటించిన ‘జెంటిల్ మన్’ చిత్రంలో ‘దర్శనం’ పాత్ర తన హృదయానికి ఎంతో దగ్గరైందని హాస్య నటుడు వెన్నెల కిషోర్ అన్నాడు. ఈ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వెన్నెల కిషోర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా షూటింగ్ లోని ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. కాగా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం సహా పలు చిత్రాల్లో వెన్నెల కిషోర్ నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News