: ఫర్నిచర్ ను తీసుకువెళ్లేందుకు యత్నించిన ఏపీ ఉద్యోగులు.. అడ్డుకున్న తెలంగాణ ఉద్యోగులు
ఫర్నిచర్ తీసుకువెళ్లేందుకు యత్నించిన ఏపీ ఉద్యోగులను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్న సంఘటన హైదరాబాద్ లోని సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. కాగా, సుమారు రెండు నెలల క్రితం హైదరాబాద్ నుంచి అమరావతికి వెళుతున్న సమయంలో ఏపీ ఉద్యోగులు సంక్షేమ భవన్ ఉద్యోగుల ఫైళ్లు తీసుకువెళ్లేందుకు యత్నించడం, అన్ని ఫైళ్లను తీసుకువెళ్తే ఎలా? అంటూ టీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. పోలీసులు సర్ది చెప్పడంతో ఉద్యోగుల మధ్య గొడవ సద్దుమణగడం విదితమే.