: సంప్రదాయ వారెంటీకి రెట్టింపు ఆఫర్... మార్కెట్లో లీఎకో సరికొత్త టీవీలు


చైనా కేంద్రంగా పనిచేస్తూ, ఇండియాలో విజయవంతమైన స్మార్ట్ ఫోన్ మోడళ్లను ప్రవేశపెట్టిన లీఎకో, తాజాగా స్మార్ట్ టీవీల బిజినెస్ లో కాలుమోపింది. సూపర్ 3 సిరీస్ లో మూడు వేరియంట్లను విడుదల చేసింది. ఎక్స్ 55, ఎక్స్ 65, మ్యాక్స్ 65 స్మార్ట్ టీవీల ధరలు వరుసగా రూ. 59,790, రూ. 99,790, రూ. 1,49,790గా ఉంటాయని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అతుల్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని తమ సొంత ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ లీమాల్‌, ఫ్లిప్‌ కార్ట్ ల ద్వారా మాత్రమే విక్రయించనున్నామని తెలిపారు. ఎకోసిస్టమ్‌ సాంకేతికత ద్వారా తయారైన వీటిని మార్కెట్లో ఈ తరహా స్మార్ట్ టీవీలు విక్రయించబడుతున్న ధరతో పోలిస్తే తక్కువకే అందజేస్తున్నామని వివరించారు. అన్ని టీవీల్లో 4కే అల్ట్రా హెడ్డీ డిస్ ప్లే, 178 డిగ్రీ వ్యూ యాంగిల్, డాల్బీ, డీటీఎస్ సౌండ్ వ్యవస్థలు, యూఎస్బీ 3.0 తదితర సదుపాయాలున్నాయని తెలిపారు. సంప్రదాయ స్మార్ట్ టీవీ మార్కెట్లో 1 నుంచి రెండేళ్ల వారెంటీ ఇస్తుండగా, తాము సూపర్ 3 సిరీస్ టీవీలకు నాలుగేళ్ల పూర్తి టీవీ కాంపోనెంట్ ప్యానల్ వారెంటీని ఇస్తున్నామని, అన్ని టీవీలకూ లీఎకో వీఐపీ మెంబర్ షిప్ రెండేళ్ల పాటు ఉచితమని వివరించారు.

  • Loading...

More Telugu News