: ఎల్ వైఎఫ్ సిరీస్ నుంచి మరోకొత్త స్మార్ట్ ఫోన్ విడుదల
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ లైఫ్(ఎల్ వైఎఫ్) సిరీస్ లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్ లోకి వచ్చింది. లైఫ్ విండ్ 2 పేరుతో మార్కెట్లోకి విడుదలైన దీని ధర రూ.8,299గా సంస్థ నిర్ణయించింది. ఒక సిమ్ కార్డు స్లాట్ మాత్రమే ఒక సమయంలో 4 జీ నెట్వర్క్ కోసం ఉపయోగించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 6 అంగుళాల డిస్ ప్లే, 4 జీ వాయిస్ ఓవర్ ఎల్ టీఈ ఇందులోని ప్రత్యేకతలు. మిగిలిన ఫీచర్ల విషయానికొస్తే...2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 32 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, 8 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ ముందు కెమెరా, 1 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, డ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యుయల్ సిమ్ సదుపాయం వంటి ప్రత్యేకతలు 2 ఫాబ్లెట్ లో ఉన్నాయి.