: అహ్మదాబాదు చేరుకున్న అమిత్ షా!... మరికాసేపట్లో గుజరాత్ బీజేఎల్పీ భేటీ!
గుజరాత్ కొత్త సీఎం ఎవరన్న విషయం మరికాసేపట్లో తేలిపోనుంది. 75 ఏళ్లు పైబడ్డ వారు పదవులకు దూరంగా ఉండాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు మొన్నటిదాకా గుజరాత్ సీఎంగా ఉన్న ఆనందీబెన్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆనందీబెన్ పటేల్ స్థానంలో కొత్త వ్యక్తిని గుజరాత్ సీఎంగా ఎంపిక చేసే బాధ్యతను బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయమే ఢిల్లీలో బయలుదేరిన అమిత్ షా కొద్దిసేపటి క్రితం గుజరాత్ లోని అహ్మదాబాదు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన గుజరాత్ బీజేఎల్పీ భేటీని నిర్వహించనున్నారు. ఈ భేటీలోనే ఆయన గుజరాత్ కొత్త సీఎం అభ్యర్థి ఎవరన్న విషయాన్ని అదికారికంగా ప్రకటించనున్నారు.