: క్రీడా ప్రియులా?...అయితే 17 రోజులు నిద్రకు దూరమవ్వాల్సిందే!


మీరు క్రీడా ప్రియులా? ఆటలంటే చెవికోసుకుంటారా? అయితే 17 రోజుల పాటు నిద్రకు దూరం కావాల్సిందే. సాధారణంగా ఆటలంటే అమితమైన అభిమానం చూపించేవారు...ఆటలపోటీలు ఎక్కడ జరుగుతున్నా వెళ్లి చూసి ఆనందిస్తారు. అయితే విదేశాల్లో జరిగే పోటీలను మాత్రం టీవీల్లో వచ్చే లైవ్ లో చూసి ఆనందిస్తారు. రేపు రియో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. భారత కాలమానం ప్రకారం రియో ఎనిమిదిన్నర గంటలు ఆలస్యంగా ఉంటుంది. దీంతో రియో ఒలింపిక్స్ భారత్ లో ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతాయి. రాత్రంతా కొనసాగి, ఉదయం ఏడు గంటలకు సమాప్తమవుతాయి. 17 రోజుల పాటు జరగనున్న ఆటల క్రీడోత్సవాన్ని భారత్ లో వివిధ ఛానెళ్లు లైవ్ ప్రసారాలు చేయనున్నాయి. అయితే ఆటలు చూడాలంటే మాత్రం తెల్లవార్లూ మేలుకుని ఉండాల్సిందే. ప్రధానంగా క్షణాల్లో ముగిసిపోయే జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల పరుగు పందెం చూసేందుకు అంతా ఉత్సాహం చూపిస్తారు. బోల్డ్ వంద మీటర్ల పరుగు మన కాలమానం ప్రకారం 15వ తేదీ ఉదయం గంటల 6.55 నిమిషాలకి జరుగుతుంది. దీంతో ఆటగాళ్ల మెరుపులు చూడాలంటే మేలుకుని ఉండడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.

  • Loading...

More Telugu News