: లండన్ లో ఉగ్రదాడి!... కత్తి చేతబట్టి ముష్కరుడి వీరంగం, మహిళ దుర్మరణం
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. వివిధ దేశాల్లోని ప్రధాన నగరాల్లోకి ఎంటరవుతున్న ఉగ్రవాదులు యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా బ్రిటన్ రాజధాని లండన్ లో ఓ ఉగ్రవాది కత్తి చేతబట్టి వీరంగమాడాడు. ఊహించని విధంగా వీధుల్లోకి వచ్చిన అతడు కనిపించిన వారిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఓ మహిళ దుర్మరణం చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించారు. మరింత మందిని గాయపరిచేలోగానే ఆ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.