: ‘అనంత’లో ప్రమాదం... మంత్రి పరిటాల బంధువు సహా ఇద్దరు దుర్మరణం


అనంతపురం జిల్లాలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఓ ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత దగ్గరి బంధువు సహా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జిల్లాలోని రాప్తాడు మండలం ప్రసన్నాయునిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో రైలు ఢీకొని ఇద్దరు చనిపోయారు. మృతుల్లో పరిటాల సునీత దగ్గరి బందువు గిరినాయుడుతో పాటు గుంటూరు వాసి అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. రిలయన్స్ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వీరు... ప్రసన్నాయునిపల్లిలో రిలయన్స్ టవర్ ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఆ సమయంలో రైలు రాకను గుర్తించని వీరిద్దరూ ట్రాక్ పైకి వెళ్లగా, వేగంగా దూసుకువచ్చిన రైలు వారిని ఢీకొట్టింది.

  • Loading...

More Telugu News