: జీఎస్టీ బిల్లు ఆమోదం పొందింది... భోజనం చేసి వెళ్లండి...!: డిప్యూటీ ఛైర్మన్ కురియన్
జీఎస్టీ బిల్లు ఆమోదం పొందింది. బీజేపీ చేసిన లాబీయింగ్ తో రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై జరిగిన ఓటింగ్ లో అన్నాడీఎంకే మినహా పాల్గొన్న పార్టీలన్నీ మద్దతు పలికాయి. దీంతో బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఈ ఆనందాన్ని పంచుకునేందుకు ఎన్డీయే డిన్నర్ ఏర్పాటు చేసింది. దీంతో అంతా భోజనం చేసి వెళ్లాలని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఎంపీలను కోరారు. అనంతరం సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.