: గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ భేటీ
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాదులో రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్ పలు విషయాలపై గవర్నర్ తో చర్చించారు. ప్రధాని తెలంగాణ పర్యటన, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ తో కేసీఆర్ మాట్లాడారు. అలాగే మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.