: పాకిస్థాన్ జైలులో భారతీయ ఖైదీపై తోటి ఖైదీల దాడులు


పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒక భారతీయ ఖైదీపై తోటి ఖైదీలు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దాడికి పాల్పడుతున్నారు. పెషావర్ సెంట్రల్ జైలు ఆఫ్ పాకిస్తాన్ లో హమీద్ నెహాల్ అన్సారీ సెప్టెంబర్ 17, 2015 నుంచి మూడు సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నాడు. మొదట్లో.. హమీద్ రక్షణ నిమిత్తం ఉరిశిక్ష విధించిన ఖైదీలను ఉంచే గదిలో అతన్ని ఉంచేవారు. ఆ తర్వాత ఖైదీలందరూ ఉండే గదిలో హమిద్ ను కూడా ఉంచేవారు. ఇదే గదిలో ఉన్న కారుడు గట్టిన ఖైదీలు హమీద్ పై దాడులు చేస్తుండేవారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలంటూ హమీద్ కోర్టుకు విన్నవించాడు. కాశ్మీర్ ప్రజలపై భారతీయ రక్షణ దళాలు జరుపుతున్న దాడుల గురించి తనకు పాఠాలు చెప్పాలంటూ ఇటీవల ఒక ఖైదీ తనపై దాడి చేస్తున్నాడని, తనకు రక్షణ కల్పించాలని కోర్టుకు పెట్టుకున్న అర్జీలో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం దీనిపై విచారణ జరిపి పరిస్థితిని వివరించాలని జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించింది.

  • Loading...

More Telugu News