: జైట్లీ హామీతోనే మా పోరాటానికి తాత్కాలిక బ్రేక్ వేశాం: ఎంపీ రామ్మోహన్


కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీ మేరకే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తాము చేస్తున్న పోరాటానికి తాత్కాలిక బ్రేక్ వేశామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కొన్ని రోజులు వేచి చూస్తామని, ఎటువంటి ఫలితం కనపడకపోతే తమ పోరాటాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. తమకు అన్ని పార్టీల మద్దతు ఉందని, తమ పోరాటం ప్రజల కోసమే చేస్తున్నాము తప్పా, రాజకీయాల కోసం కాదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై లోక్ సభలో చర్చకు పట్టుబడతామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News