: గౌహతి ఎయిర్‌పోర్టులో విమానాల రాపిడి.. త‌ప్పిన పెను ప్ర‌మాదం


గౌహతి ఎయిర్‌పోర్టులో ఈరోజు పెను ప్రమాదం త‌ప్పింది. రెండు ఇండిగో విమానాలు ప్ర‌మాదం అంచుదాకా వెళ్లి బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ విమానాలు రెండూ ద‌గ్గ‌రగా వెళ్ల‌డంతో ప‌ర‌స్ప‌ర రాపిడికి గుర‌య్యాయి. దీంతో ఆ విమానాల్లోని ఆరుగురికి గాయాల‌య్యాయి. అలాగే, విమానాలు కూడా దెబ్బ‌తిన్న‌ట్లు తెలుస్తోంది. గాయాలపాల‌యిన వారికి ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్ర‌థ‌మ చికిత్స అందించి, ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News