: లోక్ సభలో మూడో రోజు ‘హోదా’ సెగలు!... నినాదాలు చేస్తున్న వైసీపీ ఎంపీలు!


ఏపీకి ప్రత్యేక హోదా సెగలు వరుసగా మూడో రోజు కూడా లోక్ సభను తాకాయి. సోమవారం నుంచి మొదలైన ఈ నిరసనలు నేడు కూడా సభలో కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం సభ ప్రారంభం కాగానే వైసీపీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. తమ సీట్లలో నుంచి లేచిన వైసీపీ ఎంపీలు వెల్ లోకి దూసుకువచ్చి నినాదాలు చేస్తున్నారు. స్పీకర్ వారించినా వారు వినకుండా నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు.

  • Loading...

More Telugu News