: ఇతర రాష్ట్రాలతో పోల్చి ఏపీకి అన్యాయం చేస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, బీజేపీ నాటకాలాడుతున్నాయని, హోదా వచ్చే వరకు తమ ఫైట్ ఆగదని కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ నేతలు ఇతర రాష్ట్రాలతో పోల్చి ఏపీకి అన్యాయం చేస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుని ఎప్పుడు పూర్తి చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎటువంటి న్యాయం జరగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా సాధించేవరకు కాంగ్రెస్ నిద్రపోదని ఆయన అన్నారు. కేవీపీ ప్రైవేటు బిల్లుకి అన్ని రాష్ట్రాలు మద్దతు ఇచ్చాయని ఆయన అన్నారు.