: మరో డోపీ దొరికాడు... రియోకు ముందు బుక్కయిన ధర్మవీర్ సింగ్
వచ్చే వారంలో రియో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న తరుణంలో మరో భారత ఆటగాడు డోపింగ్ పరీక్షల్లో దొరికిపోయాడు. ఒలింపిక్స్ కు భారత్ తరఫున ఎంపికైన స్ప్రింటర్ ధర్మవీర్ సింగ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. ధర్మవీర్ సింగ్ కు రెండుసార్లు జరిపిన పరీక్షల్లోనూ డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించినట్టు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ధర్మవీర్ సింగ్ ఒలింపిక్స్ పోటీలకు వెళ్లడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు డోపీలుగా తేలగా, రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కు మాత్రమే అధికారులు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.