: అమ్మ భక్తికి పరాకాష్ఠ... జయలలిత స్ఫూర్తితోనే హిల్లరీ బరిలోకి దిగారట!


తమిళనాట అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అమ్మ భక్తి పరాకాష్ఠకు చేరింది. కూనూరు ఎమ్మెల్యే రాము, మిగతా ఎమ్మెల్యేలు అవాక్కయ్యేలా సీఎం జయలలితను స్తుతిస్తుంటే, మిగతావారు విస్తుపోయి కూడా బల్లలు చరుస్తూ మద్దతు పలకాల్సిన పరిస్థితి రాష్ట్ర అసెంబ్లీలో ఏర్పడింది. "అమెరికాకు మొట్టమొదటి అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ గెలవనున్నారు. ఆమె విజయానికి కారణం పురచ్చితలైవి అమ్మ. అమెరికన్లు తొలి అధ్యక్షురాలి కోసం ఎదురుచూస్తున్న కారణం కూడా అమ్మే" అంటూ భక్తిని ప్రదర్శించారు. 2011లో అమెరికాకు విదేశాంగ మంత్రిగా ఉంటూ చెన్నైకి వచ్చిన వేళ, జయలలిత పాలన చూసిన హిల్లరీ ఎంతో స్ఫూర్తిని పొందారని, ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అధ్యక్ష బరిలో ఉన్నారని రాము చేసిన వ్యాఖ్యలను విపక్ష డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుని మరీ వినాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News