: గుజరాత్ సీఎం ఎవరు?... నేడు తేల్చేయనున్న బీజేపీ!
గుజరాత్ సీఎం పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఆనందీబెన్ పటేల్ వారసుడెవరన్న విషయం నేడు తేలిపోనుంది. ఈ విషయాన్ని తేల్చేందుకు నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో గుజరాత్ సీఎం ఎవరన్న విషయం తేలిపోనుంది. అమిత్ షానే గుజరాత్ సీఎంగా పంపండంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కోరుతుండగా, బీజేపీ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. బీజేపీ గుజరాత్ అధ్యక్షుడిగా ఉన్న విజయ్ రూపానీ, మరో కీలక నేత నితిన్ పటేల్ లలో ఎవరినో ఒకరిని సీఎం పదవి వరించనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.