: చంటిబిడ్డతో ఐఎస్ లో చేరేందుకు యువతి పయనం!... ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరెస్ట్!
చంకన పసిబిడ్డను వేసుకుని కాబూల్ విమానం ఎక్కుతున్న ఓ ముస్లిం యువతిని మొన్న ఆదివారం ఉదయం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో చేరేందుకే సదరు యువతి వెళుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన యాస్మిన్ మహమ్మద్... ఇప్పటికే భర్తతో విడాకులు తీసుకుని వేరుగా జీవిస్తోంది. ఆమెకు ఐదేళ్ల వయస్సున్న కొడుకు కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం యాస్మిన్ తన కొడుకును చంకనేసుకుని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో కాబూల్ వెళ్లే విమానం ఎక్కేందుకు వెళ్లింది. అయితే అప్పటికే ఆమెకు సంబంధించిన కీలక సమాచారం సేకరించిన పోలీసులు మెరుపు దాడి చేసి చంటిబిడ్డతో సహా ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను సుదీర్ఘంగా విచారించి కేరళ పోలీసులకు అప్పగించారు. ఇటీవల కేరళలో కనిపించకుండా పోయిన 21 మందితో ఆమెకు సంబంధాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు.