: అవుట్ డోర్ షూటింగులో డైరెక్టర్ ను ఆటపట్టించిన సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిత్యం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. తన చుట్టూఉన్న వాతావరణం కూడా ఉల్లాసంగా ఉండాలని భావిస్తుంది. తాజాగా 'జనతా గ్యారేజ్' షూటింగ్ లో ఉన్న సమంత డైరెక్టర్ కొరటాల శివను ఆటపట్టించింది. కేరళలోని పొలాచ్చిలో ఓ జలపాతం వద్ద 'జనతా గ్యారేజ్' పాట షూటింగ్ జరుగుతోంది. అక్కడి ప్రకృతి అందాలకు ఫిదా అయిపోయిన సమంత ఆ జలపాతంలో తడవాలని అనుకుంది. అయితే తానొక్కత్తినే తడిస్తే ఆనందం ఏముందని భావించిందో ఏమో కానీ...డైరెక్టర్ కూడా తడిస్తేనే షూటింగ్ కు వస్తానని షరతు పెట్టింది. అసలే రాష్ట్రం కాని రాష్ట్రంలో షూటింగ్... ఆపడం ఇష్టం లేని కొరటాల శివ ఆమెతో పాటు జలపాతం జల్లుల్లో తడిశాడు. దీంతో షూటింగ్ యూనిట్ మొత్తం ఈ జల్లుల్లో తడిసేలా చేసింది. దీంతో షూటింగ్ కు కొంత విరామం కలిగింది. ఈ విషయాన్ని సమంత ట్వీట్ చేస్తూ, అందుకు సంబంధించిన ఫోటో కూడా పోస్ట్ చేసింది.