: నేచురల్ గా ఉండటమే బెస్ట్: మిల్కీ బ్యూటీ తమన్నా


దక్షిణాది హీరోయిన్ తమన్నా అనగానే అభిమానులకు, ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే పదం మిల్కీ బ్యూటీ. ‘బాహుబలి’ చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఎటువంటి మేకప్ లేకుండా ఇటీవల తీసుకున్న ఒక సెల్ఫీని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'కొత్తగా ఉండటం కన్నా నేచురల్ గా ఉండటమే బెస్ట్' అంటూ పోస్ట్ చేసిన ఆ ఫొటోలో తమన్నా సహజసిద్ధంగా కనిపించింది. ఈ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకోవడంతో.. మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా తమన్నా అందంగా ఉంటుందని కొందరు, మేకప్ లేకపోయినా అదిరిపోయేంత అందంగా ఉందంటూ ట్వీట్లు కురిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News