: ‘రియో’లో మహిళా ఫైర్ ఫైటర్ పై లైంగిక వేధింపులు


రియో ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు భద్రత కల్పించే అంశం పెద్ద సమస్యగా తయారైంది. సుమారు 85,000 మంది పోలీసులు, సైనికులు, ప్రైవేటు రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేసినప్పటికీ అపశ్రుతి చోటు చేసుకుంది. ఒక మహిళా ఫైర్ ఫైటర్ పై ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ లైంగిక వేధింపులకు యత్నించాడు. ఒలింపిక్ పార్క్ లోని వెలోడ్రోమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ ఈ దారుణానికి యత్నించాడు. నిద్రిస్తున్న మహిళా క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News