: ఏపీకి ఆర్థిక సాయం చేయాలని విభజన చట్టంలో లేదు: కేంద్ర మంత్రి లిఖితపూర్వక ప్రకటన


ఆంధ్రప్రదేశ్‌ కు ఆర్థికసాయంపై విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ రాజ్యసభలో స్పష్టం చేశారు. జీరో అవర్ లో ఆంధ్రప్రదేశ్ కు ఆర్థికసాయంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి ఎలాంటి ఆర్థిక సాయం సిఫారసులు లేవని అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించి, 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక సాయం కింద ఏపీకి 500 కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆయన తెలిపారు. దీంతో ఎంపీలు అవాక్కయ్యారు.

  • Loading...

More Telugu News