: సిక్స్ ప్యాక్ కోసం యువతను తప్పుదారి పట్టిస్తున్న ఫిట్ నెస్ సెంటర్లు


నెలరోజుల్లోనే సిక్స్ ప్యాక్ వచ్చేలా చేస్తామంటూ హైదరాబాద్ లోని ఫిట్ నెస్ సెంటర్ల నిర్వాహకులు యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ క్రమంలో యువతకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది. ఈ ఫిర్యాదు మేరకు డ్రగ్ కంట్రోలర్ అథారిటీ స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫిట్ నెస్ సెంటర్లపై దాడులకు ఆదేశించింది. ఏడీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఫిట్ నెస్ సెంటర్లపై దాడులకు దిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ఫిట్ నెస్ సెంటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్ నియంత్రణ అధికారి అమృతరావు మాట్లాడుతూ, స్టెరాయిడ్స్ వాడకాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, అందుకే, రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలకు ఆదేశించామని, స్టెరాయిడ్స్ వాడుతున్నట్లు తమ తనిఖీల్లో తేలితే కఠిన చర్యలు తప్పవని అమృతరావు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News