: సెంచరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోలేదు...కానీ జాగ్రత్తగా ఆడా: రహానే


రెండో టెస్టులో సెంచరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోలేదని టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే తెలిపాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన అనంతరం మాట్లాడుతూ, తొలి టెస్టులో త్వరగా పెవిలియన్ చేరడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని తెలిపాడు. అప్పుడే ఇలా జరగకుండా చూసుకోవాలని భావించానని చెప్పాడు. అందుకే భారీ షాట్లపై దృష్టి పెట్టకుండా ఫుట్ వర్క్ మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టానని తెలిపాడు. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని రహానే కితాబు ఇచ్చాడు. దీంతో సాహా అవుటయ్యాడని, అనంతరం లోయర్ ఆర్డర్ తో కలిసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావించానని రహానే చెప్పాడు. తొలి టెస్టులో కోహ్లీకి జతగా అశ్విన్ సెంచరీతో భారీ స్కోరు సాధనలో భాగం కాగా, రెండో టెస్టులో కేఎల్ రాహుల్ చేసిన భారీ స్కోరుకి రహానే చేసిన సెంచరీ (108) దోహదపడింది. దీంతో టీమిండియా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే 300 పైచిలుకు పరుగుల ఆధిక్యాన్ని స్కోరు బోర్డుమీద ఉంచగలిగింది.

  • Loading...

More Telugu News