: బొద్దుగుమ్మ రాశీ ఖన్నా చెబుతున్న ముద్దు ముద్దు కబుర్లు!


తెలుగు చిత్రసీమలో రాణిస్తున్న బొద్దుగుమ్మ రాశీ ఖన్నా, తనకు ఇష్టమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. తనంతట తానే తన గురించి చెప్పుకుంటూ, ఇష్టాయిష్టాలను చెప్పింది. ఆ వివరాలివి... ఇష్టమైన చిత్రం: తెలుగులో బొమ్మరిల్లు, హిందీలో ఖూబ్ సూరత్. ఇష్టమైన పాట (తన సినిమాల్లో): ఏం సందేహం లేదు (ఊహలు గుసగుసలాడే) ఇష్టమైన సీన్: ఊహలు గుసగుసలాడే చిత్రంలో ప్రభావతి, ఉదయ్ భాస్కర్ ల మధ్య డిన్నర్ సీన్. ఇష్టమైన హీరో: తెలుగులో మహేష్ బాబు, హిందీలో రణబీర్ కపూర్. ఇష్టమైన ఆహారం: పెద్దగా పట్టించుకోను... ఆరోగ్యమనిపించేవన్నీ ఇష్టమే. ఇష్టమైన సహనటుడు: పోతినేని రామ్. ఇష్టమైన హాలిడే స్పాట్: దక్షిణ స్పెయిన్. ఇష్టమైన పుస్తకం: డాక్టర్ బ్రియాన్ వైస్ రచించిన 'ఓన్లీ లవ్ ఈజ్ రియల్'. ఇష్టమైన పాట: తెలుగులో గువ్వా గోరికంతో, హిందీలో జరా జరా. చిన్ననాటి గుర్తున్న సంగతి: తొలి అకడమిక్ అవార్డును అందుకోవడం. కాలేజీలో ఇష్టమైన సబ్జెక్ట్: ఇంగ్లీష్. ఇష్టమైన రెస్టారెంట్: 'ఎన్' గ్రిల్. ఇష్టమైన వంటకాలు: లెబనీస్ ఫుడ్. ఇష్టమైన రంగు: తెలుపు. ఇష్టమైన దుస్తులు: నప్పే డ్రస్సులు ఏవైనా. ఇష్టమైన ప్రేమకథ: నా తల్లిదండ్రులదే. ఇష్టమైన కొటేషన్: ఒక్కటే అంటే చెప్పలేను.

  • Loading...

More Telugu News