: ప్లకార్డుల ప్రదర్శన సరికాదన్న స్పీకర్!... వెల్ లోకి దూసుకెళ్లిన వైసీపీ ఎంపీలు!


ఏపీకి ప్రత్యేక హోదా అంశం దేశ రాజధాని హస్తినలో వేడి రాజేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం అగ్గి రాజేసింది. జైట్లీ ప్రకటన వచ్చిన వెంటనే అప్పటిదాకా మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూడా నిరసన బాట పట్టింది. ఇక అప్పటికే పలు మార్లు ఏపీకి ప్రత్యేక హోదా కోసం నినదించిన వైసీపీ... తాజాగా పార్లమెంటులో వరుస నిరసనలకు తెర తీసింది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం టీడీపీ ఎంపీలతో కలిసి ప్లకార్డులు పట్టుకుని లోక్ సభలోకి వెళ్లిన వైసీపీ ఎంపీలు నినాదాల హోరు వినిపించారు. అయితే సభలో ప్లకార్డుల ప్రదర్శన సరికాదని స్పీకర్ సుమిత్రా మహాజన్ వారించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లారు. మరోవైపు టీడీపీ సభ్యులు కూడా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనంంటూ నినాదాలు చేస్తున్నారు. రెండు పార్టీలకు చెందిన ఎంపీల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లుతోంది.

  • Loading...

More Telugu News