: మూడు రోజులు ఎక్కడికీ వెళ్లవద్దు: ఎంపీలకు కాంగ్రెస్ కూడా విప్


వస్తు సేవల పన్ను బిల్లు (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ - జీఎస్టీ) రేపు రాజ్యసభకు రానున్న నేపథ్యంలో, తమ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. సభ్యులంతా బుధ, గురు, శుక్ర వారాల్లో తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని ఆ పార్టీ ఆదేశించింది. కాగా, ఇప్పటికే బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ఎలాగైనా సరే పాస్ చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు మరోసారి కాంగ్రెస్, సమాజ్ వాదీ సహా విపక్ష పార్టీల ప్రతినిధులతో మరోసారి సమావేశం కానున్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే జీఎస్టీ బిల్లుకు మద్దతివ్వాలన్న ఒత్తిడి కాంగ్రెస్, టీడీపీ ఎంపీలపై పెరుగుతుండగా, ఈ విషయంలో ఇరు పార్టీలూ తమ వైఖరిని ఇంకా వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News