: కడప గడపలో డ్రగ్స్ తయారీ!... మెరుపు దాడి చేసి రూ.4.5 కోట్ల ఎఫెడ్రెయిన్ పట్టుకున్న డీఆర్ఐ!


కడప గడపలో మొన్న డ్రగ్స్ కలకలం రేగింది. ఇప్పటికే పొట్టి కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్న అమాయకులను కేంద్రంగా చేసుకుని కడప నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయన్న వార్తలు బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కడపలో డ్రగ్స్ విషయంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు దృష్టి సారించారు. దర్యాప్తులో భాగంగా కడపలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోనే మత్తు పదార్థాల తయారీ జరుగుతోందని డీఆర్ఐ అదికారులు పక్కా ఆధారాలను సేకరించారు. ఆ తర్వాత మొన్న (గత నెల 30న) రాత్రి కడపలో మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని సూర్య కెమికల్స్ లో డ్రగ్స్ తయారీ కోసం సేకరించి పెట్టిన 45.165 కిలోల ముడి పదార్థం ఎఫెడ్రెయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే డ్రగ్స్ తయారీలో కీలక నిందితుడిగా భావిస్తున్న పుట్లంపల్లెకు చెందిన సూర్యనారాయణరెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఎఫెడ్రెయిన్ విలువ ఎంతలేదన్నా రూ.4.5 కోట్లకు పైగానే ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News