: చంద్రబాబు వద్దకు ‘ఒలింపిక్’ పంచాయతీ!... వివాదాన్ని పరిష్కరించాలని జేసీ పుత్రుడి వినతి!


ఏపీ ఒలింపిక్ సంఘంపై నెలకొన్న వివాదం పంచాయతీ తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు సీఎం రమేశ్, గల్లా జయదేవ్ ల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఎవరికి వారే ఎన్నికలు నిర్వహించుకున్న రెండు వర్గాలు... తమదే అసలైన ఏపీ ఒలింపిక్ సంఘమంటూ వేర్వేరుగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలో ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. రమేశ్, గల్లా వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి రంగప్రవేశం చేసిన ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు అందుకు విరుద్ధంగా వివాదాన్ని మరింత జటిలం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రమేశ్ వర్గానికి చెందిన సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి విజయవాడలో సీఎం చంద్రబాబును కలిశారు. ఒలింపిక్ సంఘం గుర్తింపుపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పదించిన చంద్రబాబు... ఈ వివాదాన్ని వీలయినంత త్వరగా పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News