: 401 పరుగులు చేసిన టీమిండియా...205 పరుగుల ఆధిక్యం


వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు రెండో టెస్టులో పట్టుబిగిస్తోంది. 358 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. విండీస్ బౌలర్లు టీమిండియా బ్యాట్స్ మన్ పై ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. ఆ క్రమంలో రహనే (62) అర్ధసెంచరీ సాధించగా, సాహా (38) ఆకట్టుకుంటున్నాడు. బౌలర్ ఎవరైనా నిలకడగా ఆడుతున్నారు. దీంతో 141 ఓవర్ లో టీమిండియా 401 పరుగుల మార్కు దాటింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వీరిద్దరూ ఆడుతున్నారు. కాగా, ఐదు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసిన టీమిండియా 205 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంకా టీమిండియా చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. దీంతో మరికొంత స్కోరు చేసి, విండీస్ ను రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు పిలవాలని కోహ్లీ వ్యూహం పన్నాడు.

  • Loading...

More Telugu News