: అమితాబ్ నివాసంలోకి అభిమాని చొరబాటు యత్నం... పోలీసులకి అప్పజెప్పిన సిబ్బంది!
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసంలోకి ప్రవేశించడానికి ఓ అభిమాని ప్రయత్నించాడు. ముంబైలోని జూహూలో ఉన్న అమితాబ్ నివాసం 'జల్సా'లో చొరబడుతున్న దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను బీహార్ కు చెందిన వ్యక్తి అని, అమితాబ్ కు వీరాభిమాని అని పోలీసులు తెలిపారు. అమితాబ్ ను కలిసి, ఆయన ముందు పాట పాడాలని భావించిన ఆ వ్యక్తి అమితాబ్ ను ఎలాగైనా కలవాలని ఆయన నివాసంలోకి చొరబడినట్టు తెలిపారు. అమితాబ్ బచ్చన్ ముంబైలో ఉంటే ప్రతి ఆదివారం తన కోసం వచ్చే అశేష అభిమానులను తప్పకుండా 'జల్సా' నివాసంలో కలుస్తుంటారు.