: హిల్లరీ క్లింటన్ స్విమ్ సూట్ వాల్ పెయింట్ పై నిరసన!


అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో వేసిన గ్రాఫిటీ పెయింట్ పెను దుమారం రేపుతోంది. మెల్‌ బోర్న్‌ శివార్లలోని ఫుట్‌ స్క్రే ప్రాంతంలోని ఓ గోడ మీద లష్‌ సక్స్‌ అనే చిత్రకారుడు కుడ్య చిత్రంగా (వాల్ పెయింట్) హిల్లరీ బొమ్మ వేశాడు. స్విమ్‌ సూట్‌ లో హిల్లరీ క్లింటన్ ఖరీదైన నెక్లెస్, డాలర్లు పట్టుకున్నట్టుగా దీనిని చిత్రీకరించాడు. ఇది హిల్లరీని అవమానించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ భార్య మెలీనియా గతంలో మోడల్ గా ఉన్నప్పటి నగ్న చిత్రాలు వెల్లడైన సమయంలో ఈ చిత్రాన్ని గీయడం రెచ్చగొట్టే చర్య అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. దీంతో దీనిని మున్సిపల్ అధికారులు తొలగించారు. కుడ్య చిత్రాలు గీయడం తప్పుకానప్పటికీ ఒక వ్యక్తి నగ్న, లేదా అభ్యంతరకర చిత్రాలు గీయడం నేరమని, అందుకే తొలగిస్తున్నామని మన్సిపల్ అధికారులు తెలిపారు. అయితే చిత్రంపై విమర్శలు రావడంపై చిత్రకారుడు లష్‌ సక్స్‌ విచారం వ్యక్తం చేశారు. కళ పట్ల ఆంక్షలు ఉండకూడదని ఆయన వాదిస్తున్నాడు. కాగా, లష్ సక్స్ గతంలో డొనాల్డ్ ట్రంప్‌, కిమ్‌ కర్దాషియన్‌ గ్రాఫిటీ చిత్రాలు గీశారు.

  • Loading...

More Telugu News