: తెలంగాణ ఎంసెట్-2 రద్దుపై రేపు సీఎం ప్రకటన చేస్తారు!: కడియం శ్రీహరి


తెలంగాణ ఎంసెట్-2 రద్దుపై రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తారని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నిందితులు ఎలాంటి వారైనా కఠిన చర్యలకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంసెట్-3ని వచ్చే నెల 2 లేదా 3వ తేదీల్లో నిర్వహించి 9వ తేదీన ఫలితాలు వెల్లడించాలని, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంసెట్ ను నిర్వహించడంలో 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన జేఎన్టీయూకు బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో రేపు సాయంత్రం ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు జరిపిన సమాలోచనల కారణంగా ఆలస్యం జరిగినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News