: విండీస్ లో సెంచరీ చేయడం ద్వారా కేఎల్ రాహుల్ సాధించిన రికార్డులివి


వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 158 పరుగులు చేసిన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ పలు రికార్డులు నెలకొల్పాడు. వెస్టిండీస్ తో తొలిసారి ఆడిన టీమిండియా ఆటగాడు సెంచరీ సాధించడం ఇదే తొలిసారి. గతంలో ఓపెనర్ గా అజయ్ జడేజా చేసిన 96 పరుగులే ఇంత వరకు అత్యధిక పరుగులు కాగా, ఇప్పుడు రాహుల్ చేసిన 158 పరుగులే అత్యధికం. టీమిండియా తరపున ఇప్పటి వరకు పాలి ఉమ్రిగర్ (130), బ్రిజేష్ పటేల్ (115), అశ్విన్ (113), సంజయ్ మంజ్రేకర్ (108) సెంచరీలు చేయగా, వారందరిలో 158 పరుగులతో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో నిలబడ్డాడు.

  • Loading...

More Telugu News