: ఒబామాకు 'విషపు ఉత్తరం' పంపిన వ్యక్తి అరెస్టు
కొద్దిరోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విష పదార్థం 'రిసిన్' పూసిన ఉత్తరం పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మిసిసిపికి చెందిన ఆ వ్యక్తి ఓ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడని పోలీసు వర్గాలు తెలిపాయి. అతని పేరు ఎవరెట్ డష్కే (41). నిన్న రాత్రి డష్కే నివాసంపై దాడి చేసిన ఎఫ్ బీఐ ఏజెంట్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంటి నుంచి పలు ఆధారాలు కూడా లభ్యమైనట్టు తెలుస్తోంది. డష్కేపై ఛార్జిషీటు నమోదు చేసిన నేపథ్యంలో నేరానికి పాల్పడ్డట్టు రుజువైతే అమెరికా చట్టాల ప్రకారం జీవిత ఖైదు పడే అవకాశముంది.