: మరోసారి రజనీకాంత్ ను కోరిన కిరణ్ బేడీ
పాండిచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ మరోసారి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను పాండిచ్ఛేరి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరారు. పాండిచ్చేరిలో 'ప్రోస్పరస్ పాండిచ్చేరి' కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రజనీకాంత్ పాండిచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తే రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుందని అన్నారు. నగరం ఆరోగ్యకరంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రతి శని, ఆదివారాల్లో వీధుల్లో పర్యటించి స్థానిక ప్రజల సహకారంతో శుభ్రం చేయిస్తున్నారు. రోడ్లపై చెత్తను తొలగించి, ఇళ్ల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు.