: వ్యాట్ ఎత్తివేతపై తుది నిర్ణయం సీఎందే: ఆనం


వస్త్ర వ్యాపారులపై వ్యాట్ ఎత్తివేత విషయంలో ముఖ్యమంత్రిదే తుదినిర్ణయం అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్ లో మంత్రివర్గ ఉపసంఘం.. వస్త్ర వ్యాపారుల సంఘం ప్రతినిధులతో సమావేశం అయింది. భేటీలో వ్యాట్ ఎత్తివేత అంశంతోపాటు వస్త్ర వ్యాపారుల ఇతర డిమాండ్లను పరిశీలించారు. సమావేశం అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు. ఈ సాయంత్రంలోగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని భావిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News