: వైకాపాపై కక్షగట్టిన చంద్రబాబు... తెలుగుదేశానికి పోయేకాలం దాపురించింది!: భూమన


వైకాపాపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కక్ష కట్టారని వైకాపా ఆరోపించింది. పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి కొద్ది సేపటి క్రితం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి, తెలుగుదేశానికి పోయేకాలం దాపురించిందని నిప్పులు చెరిగారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఆ పార్టీ అవలంబిస్తోందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ నేతలు డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. పథకం ప్రకారం మహానేత వైఎస్ విగ్రహాలను తొలగిస్తున్నారని, తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో చంద్రబాబులో గుబులు పుడుతోందని అన్నారు. తాము చేపట్టిన గడప గడపకూ వైఎస్ఆర్ లో భాగంగా, చంద్రబాబు సర్కారుపై ప్రజలు ఏ మేరకు కోపంగా ఉన్నారన్న విషయం వెల్లడవుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News