: లిఫ్ట్ లో ఇరుక్కున్న డొనాల్డ్ ట్రంప్... రెస్క్యూ చేసిన ఫైర్ ఫైటర్లు


రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తన సహచరులతో కలసి లిఫ్టులో ప్రయాణిస్తున్న వేళ, అది మధ్యలో ఆగిపోవడంతో కాస్త టెన్షన్ పడ్డారు. ఈ ఘటన కోలరాడో స్ప్రింగ్స్ లో జరిగింది. ఇక్కడి మైనింగ్ ఎక్స్ఛేంజ్ రిసార్టులో జరిగిన కార్యక్రమానికి వెళ్లిన ఆయన, ఒకటి, రెండవ ఫ్లోర్ల మధ్య చిక్కుకుపోయారు. బయటకు వచ్చేందుకు వీలు కుదరక పోవడంతో ఫైర్ డిపార్ట్ మెంటుకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, ట్రంప్ ఆయన అనుచరులను సురక్షితంగా కాపాడారు. లిఫ్టు పై భాగానికి చేరుకున్న ఫైటర్లు, పైనున్న మెటల్ రూఫ్ ను తొలగించి, ఓ నిచ్చెన లోపలికి దించి ఇరుక్కున్న వారిని కాపాడారు. ఈ ఘటన నిజమేనని అంగీకరించిన ట్రంప్ ప్రచార బృందం మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించడం గమనార్హం.

  • Loading...

More Telugu News