: ‘తాగి డ్రైవ్ చెయ్యవద్దు’.. త్వరలో మద్యం బాటిళ్లపైకి ఎక్కనున్న లేబుల్!


‘మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ మద్యం బాటిళ్లపై కనిపించే హెచ్చరిక లేబుల్ పక్కనే త్వరలో మద్యం తాగి వాహనం నడపొద్దు (డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్) అనే మరో లేబుల్‌ను కూడా అతికించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే బార్లు తప్పకుండా బ్రీతలైజర్లు కలిగి ఉండాల్సిందేనన్న నిబంధనను విధించేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించే పనిలో పడింది. ఈమేరకు ఎక్సైజ్ కమిషనర్ డాక్టర్ ఆర్వీ చంద్రవదన్ పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన డ్రంకెన్ డ్రైవ్ కాన్ఫరెన్సులో మాట్లాడిన ఆయన తమ ప్రతిపాదనల గురించి వివరించారు. బార్లు, పబ్‌లు, హోటళ్లు, రిసార్టులు బ్రీతలైజర్లు కలిగి ఉండడాన్ని తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ‘‘తాగి ఉన్న మోటారిస్టులను గుర్తించడం ద్వారా బార్ల యజమానులు వారిని ప్రత్యేక వాహనం ద్వారా ఇంటికి క్షేమంగా చేర్చాలి. వినియోగదారులు ఆ పరిసరాలను విడిచిపెట్టేటప్పుడు బ్రీతలైజర్లతో వారిని విధిగా తనిఖీ చేయాలి. డ్రంకెన్ డ్రైవింగ్‌పై మార్గదర్శకాలతో రూపొందించిన యాప్‌ను త్వరలో విడుదల చేస్తాం’’ అని చంద్రవదన్ పేర్కొన్నారు. చిన్నారులతో డ్రైవింగ్ చేయించే వారిపైనా కొరడా ఝుళిపించున్నట్టు సైబరాబాద్ ఈస్ట్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు. ఇటువంటి వారికి వెయ్యి రూపాయల జరిమానాతోపాటు మూడు నెలల జైలు శిక్ష విధించనున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News