: వెంకటేశ్వర స్వామి పాత్రను పరిచయం చేసిన రాఘవేంద్రరావు
'హథీరామ్ బావాజీ' జీవిత కథ ఆధారంగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో 'ఓం నమో వెంకటేశాయ' సినిమాను ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాత్రలో హిందీ సీరియళ్లలో వెంకటేశ్వరస్వామిగా నటిస్తున్న సౌరభ ఈ సినిమాలో కూడా ఆ పాత్రలో అలరించనున్నారు. నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్లో రూపొందుతున్న నాలుగో భక్తిరస చిత్రమిది. ఇంతకు ముందు అన్నమయ్య, భక్త రామదాసు, సాయిబాబా పాత్రల్లో నాగార్జున ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో నాగార్జునతో పాటు అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.