: 'స్లీపింగ్ బ్యూటీ' రాహుల్ ధరలు, యువత గురించి మాట్లాడడం విచిత్రం: బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్
ధరల పెరుగుదలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణలకు లోక్ సభలో బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ ఘాటుగా సమాధానం చెప్పారు. లోక్ సభలో ఆమె మాట్లాడుతూ, విదేశీ పర్యటనల్లో నిత్యం కాలం గడిపే ‘స్లీపింగ్ బ్యూటీ’ రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో యువతరం, ధరల పెరుగుదలపై మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో ధరల పెరుగుదలను నియంత్రించాలన్న ఆలోచన ఏనాడూ రాలేదా? అని ఆమె ప్రశ్నించారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ బయట నిద్రపోతుంటే...ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పార్లమెంటులోనే నిద్రపోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.