: రాగల రెండురోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇతర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, ఉత్తర కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.