: విజయవాడలో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ: రావుల
ఈరోజు సాయంత్రం విజయవాడలో తెలంగాణ టీడీపీ నేతలతో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ సంస్థాగత అంశాలు, బలోపేతం, భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన విభజన హామీలు అమలు చేయాలని ఆయన అన్నారు. ‘కేంద్రంలో ప్రభుత్వం మారినంత మాత్రాన పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు మారవు’ అని వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందని ఆయన అన్నారు.