: పాకిస్థాన్లో వరదల్లో కొట్టుకుపోయిన పెళ్లి బస్సు.. 15 మంది మృతి
పాకిస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి బస్సు వరదల్లో కొట్టుకుపోయి 15 మంది చనిపోయారు. ఖైబర్ ఏజెన్సీలోని పర్వత ప్రాంతం నుంచి ఓ పెళ్లి బస్సు వెళుతోందని, అయితే ఒక్కసారిగా వరద ముంచుకురావడంతో బస్సు కొట్టుకుపోయిందని అక్కడి అధికారులు తెలిపారు. బస్సులోని వారు వరదల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యారని, తరువాత 15 మంది మృతిదేహాలు తమకు లభ్యమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అయితే, బస్సులో కచ్చితంగా 15 మందే ఉన్నారని తాము చెప్పలేమని, తమకు 15 మంది మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయని వారు తెలిపారు. ఆ ప్రాంతంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో ఇప్పటివరకు మొత్తం 20 మంది మృతి చెందారు.