: ‘హోదా’ కోసం చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వచ్చారుగా!... కాళ్లేమైనా పట్టుకోవాలా అన్న గరికపాటి!
ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేయని యత్నం అంటూ లేదని ఆ పార్టీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు అన్నారు. నిన్న రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు మెంబరు బిల్లుపై చర్చలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ తేల్చి చెప్పిన తర్వాత పార్టీ ఎంపీలు టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పటిదాకా చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి, ఇతరు కేంద్ర మంత్రులను కలిశారని చెప్పారు. అంతకంటే ఇంకే చేయాలి? కాళ్లేమైనా పట్టుకోవాలా? అని గరికపాటి ఆవేదన వ్యక్తం చేశారు.