: ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసు విచారణ వేగవంతం... మరో నిందితుడి అరెస్ట్
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. కేసులో నిన్న దళారి షేక్ రమేశ్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఈరోజు మరో దళారిని అరెస్టు చేశారు. పూణేలో జరిపిన సోదాల్లో దళారి రామకృష్ణ పోలీసులకు పట్టుబడ్డాడు. లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడి కోసం ముంబయి, ఢిల్లీలో గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. న్యూఢిల్లీ సమీపంలోని కపూర్ ప్రింటర్స్ నుంచి తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకైనట్లు అధికారులు స్పష్టం చేశారు. దీనికి పాల్పడ్డ ఖలీల్ అనే వ్యక్తి ప్రశ్నపత్రాన్ని చెన్నై, పూణే, భువనేశ్వర్, ముంబై, బెంగళూరులో ఐదుగురు దళారులకు అమ్ముకున్నట్లు వారు గుర్తించారు. ఈ ప్రశ్నపత్రం సుమారు 200 మంది విద్యార్థులకు లీకయింది.