: గున్న ఏనుగు మృతితో కదలివచ్చిన ఏనుగుల మంద!... కోయంబత్తూరులో విధ్వంసం!
తమిళనాడులోని కోయంబత్తూరులో నిన్న ఓ ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. అనుకోకుండా జనారణ్యంలోకి వచ్చేసిన ఓ గున్న ఏనుగు ప్రమాదవశాత్తు మరణించింది. విషయాన్ని గ్రహించిన గున్న ఏనుగు తల్లి అక్కడికి పరుగు పరుగున వచ్చేసింది. దాని వెంట కొన్ని ఏనుగులు కూడా కోయంబత్తూరులోకి ఎంటరయ్యాయి. జనాన్ని చూసి ఏమాత్రం బెదరని ఏనుగులు... గున్న ఏనుగు మరణించిన విషాదంలో కనిపించిన వాహనాలపై ప్రతాపం చూపాయి. ఏనుగుల బీభత్స కాండను చూసి భయభ్రాంతులకు గురైన జనం పరుగులు తీశారు. చివరికి అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఏనుగుల మందను ఎలాగోలా అడవుల్లోకి పంపేశారు.