: బుల్లెట్ రైలు టికెట్ ధర రూ.15 వేలు ఉంటుందేమో!: మోదీపై మరోమారు విరుచుకుపడిన రాహుల్


ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. మొన్న పార్లమెంటులో మోదీపై విరుచుకుపడిన రాహుల్ తాజాగా లక్నోలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో విమర్శలు గుప్పించారు. ఈసారి బుల్లెట్ రైలుపై పడిన రాహుల్.. ‘‘బుల్లెట్ రైలు కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామంటున్నారు. నాకు తెలిసి ఇంత ఖరీదైన రైలు టికెట్ రూ.15వేల లోపు ఉండదు. మోదీజీ, ఆయన సూటు, బూటు స్నేహితులు ప్రయాణించేందుకే ఈ రైలును తీసుకొస్తానంటున్నారు’’ అని ఆరోపించారు. మేకిన్ ఇండియా అంటూ ప్రధాని ఊదరగొడుతున్నారని, అందులో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ముగ్గురు, నలుగురు పారిశ్రామిక వేత్తల కోసమే మోదీ పనిచేస్తున్నారన్న రాహుల్ బడా పారిశ్రామిక వేత్తలకు చెందిన రూ.52 వేల కోట్ల రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News